Guruji Home    గురుజి గురించి

మొదటి పేజీ
గురుజి గురించి
నిర్వాహక మండలి
పెట్టుబడిదారులు
మమ్మల్ని సంప్రదించండి
తరచుగా అడగబడే ప్రశ్నలు
ఉద్యోగ అవకాశాలు
పత్రికల్లో
వార్తల్లోగురుజి
 
మొత్తం ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువు అయినట్టి భారత దేశం ఇప్పుడు సాంకేతిక పరంగాకూడా సమాచార రంగంలో కూడా, పూర్తి స్వదేశీ ఉత్పాదన అయిన  గురుజి డాట్ కామ్, భారతీయ సెర్చ్ఇంజన్, ద్వారా సరిక్రొత్త విప్లవాన్ని సృష్టించి "సాంకేతిక గురువు" గా కూడా నిలుస్తున్నది.  ప్రపంచంలో అత్యుత్తమమైన సెర్చ్ఇంజన్  గురుజి డాట్ కామ్ సత్తాను,  తద్వారా భారత ఉపఖండ ఔన్నత్యాన్ని ప్రపంచమునకు చాటి చెప్పవలె నన్నదే మా అకాంక్ష.

ఎలాగైతే నిజజీవితంలో  సహాయం కోరుతూ గురువును ఆశ్రయిస్తామో, అదేవిధంగా నిత్య జీవితంలో ఏరంగంలోనైనా, ఎటువంటి సమాచారం కావలన్న,  తక్షణమే అందించి సహకరించేలా,  ఈ స్వదేశీ సెర్చ్ ఇంజన్ " గురుజి డాట్ కామ్ " రూపొందిచబడింది.

భారత దేశాపు మొట్టమొదటి క్రాలర్ ఆధారిత సెర్చ్ ఇంజన్ గురుజి డాట్ కామ్, భారత దేశా నికి సంభంధించిన విషయాల కోసం నిర్మించబండింది.  మా స్వకీయ గణక పద్దతితో, భారత దేశమునకు సంబంధించిన వెబ్ సైట్లను గుర్తించి, అతివేగంగా మీకు ఫలితాలను అందిస్తుంది.

ఐ ఐ టి (IIT),  ఐ ఐ ఎస్సి (IISc) మొదలైన అత్యుత్తమ శ్రేణి ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన యువ,  ఔత్సాహిక సాంకేతిక విద్యారంగ నిపుణులు,  స్వదేశీ పరి జ్ఞానంతో రూపొందించిన భారతీయ సెర్చ్ ఇంజన్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కృషిచేస్తున్నారు.

భారతీయ సాంకేతిక సమాచార రంగమునకు ఇంటర్నెట్ ముఖ ద్వారము వంటి గురుజి డాట్ కామ్ కు స్వాగతం

© 2009 Guruji.com